ACBకి పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్

రంగారెడ్డి: మరో అవినీతి చేప ACBకి చిక్కింది. బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇవాళ (అక్టోబర్-2) సోదాలు నిర్వహించారు. రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి అడ్డంగా దొరికిపోయింది. భూవివాదం విషయంలో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితులు ACB అధికారులను ఆశ్రయించడంతో .. వారి సలహా మేరకు శ్రీదేవికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates