ఈఎస్ ఐ కుంభ‌కోణం : భారీ ఎత్తున‌ నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీబీ

ESI మందుల కుంభకోణంలో నిందితుల ఆస్తుల తాత్కాలిక అటాచ్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ESI మందుల కుంభకోణంలో నిందితుల ఆస్తుల జ‌ప్తుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఏసీబీ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏసీబీ లేఖ పై ప్ర‌భుత్వం స్పందిస్తూ నిందితుల ఆస్తుల‌ను తాత్కాలికంగా అటాచ్ చేసేలా అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఐఎంఎస్ జాయింట్ డైర‌క్ట‌ర్ పద్మ‌, ఫార్మాసిస్టు నాగలక్ష్మి కి చెందిన రూ.2.72కోట్ల ఆస్తులు తో పాటు, పద్మ, ఆమె కుంటబ సభ్యులు, బినామీల పేరుమీద ఉన్న 8కోట్ల 55లక్షల ఆస్తుల‌ను ఏసీబీ అధికారులు అటాచ్ చేశారు.

Latest Updates