సమాచారం అడిగితే లంచం: ACBకి చిక్కిన అధికారి

హైదరాబాద్: తెలంగాణ వక్ఫ్ బోర్డు జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ACBకి చిక్కడు. ఈ సంఘట గురువారం నాంపల్లి హజ్ హౌస్ లో జరిగింది. ఆర్టీఐ సమాచారం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ అజార్ ను సయ్యద్ మోహిన్ హోరీ అనే వ్యక్తి  కోరాడు. మలక్ పేట్ జియాహులక్ మజిద్ కోసం ఆర్టీఐ సమాచారం ఇవ్వాలని కోరాడు.

అయితే సమాచారం కావాలంటే రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు జూనియర్ అసిస్టెంట్ అజార్. దీంతో లంచం ఇవ్వడానికి ఇష్టంలేక ACBని ఆశ్రయించాడు బాధితుడు సయ్యద్. దీంతో పథకం ప్రకారం వలపన్నిన ACB అధికారులు.. నాంపల్లిలోని హజ్ హౌస్ లో అజార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఎవరైనా అవసరం కోసం.. సమాచారం అడిగితే వివరణ ఇవ్వాలని తెలిపారు ACB అధికారులు.

Latest Updates