ఏసీబీ అధికారిణికి అదనపు కట్నం వేధింపులు

ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారిణికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ అధికారిణి. కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ ఘటన జరిగింది.  పోలీసుల వివరాల ప్రకారం. పెనమలూరు మండలం తులసీనగర్ కు చెందిన ప్రభావతి ఏసీబీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.అదే గ్రామానికి చెందిన శంకర్‌శెట్టి కిరణ్‌తో ఆమెకు 2018 నవంబరులో ప్రేమ వివాహం జరిగింది. మూడు నెలల నుంచి భర్త అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్త కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates