పట్టా భూమిని అసైన్డ్ భూమి అని చెప్పి లంచం డిమాండ్

తన పొలాన్ని సర్వే కోసం అప్లై చేసుకున్న రైతు దగ్గర నుంచి లంచం వసూలు చేద్దామనుకున్నాడు ఓ ప్రభుత్వ అధికారి.  రైతు చెప్పిన వివరాలన్ని సక్రమంగా ఉండడంతో అసలు ఆ భూమి పట్టా భూమే కాదని, అసైన్డ్ భూమి అని చెప్పి అక్రమంగా డబ్బు గుంజుదామనుకున్నాడు. రూ.27 వేలు ఇస్తే ఆ భూమిని పట్టా భూమిగా మారుస్తానని ఆ రైతుతో నమ్మబలికాడు. అనుమానం వచ్చిన ఆ రైతు ఏసీబీని ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

సత్తెనపల్లికి చెందిన శ్యామల్ రెడ్డి తన తన పోలాన్ని సర్వే కోసం దరఖాస్తు చేశాడు. అయితే ఆభూమి అసైన్డ్ ల్యాండ్ పరిధిలో ఉందని, దీన్ని సరిచేయాలంటే రూ.27 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్ రాజు డిమాండ్ చేశాడు. దీనితో బాధితుడు ఏసీబీని ఆక్రమించాడు. రాజు,  అతని అసిస్టెంట్ చిత్రరంజన్ ద్వారా బాధిత రైతు నుంచి లంచం డబ్బు  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. రాజు, చిత్రరంజన్ లను అదుపులోకి తీసుకున్నారు.

ACB officials arrested a government official after demanding a bribe from a farmer

Latest Updates