ఏసీబీ వలలో ఇద్దరు కోర్టు ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు:   కూకట్ పల్లి కోర్టులో బెయిలీఫ్​(కోర్టు ఉద్యోగి)గా పని చేస్తున్న మదన్ మోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిజాంపేట్​కు చెందిన కె. వెంకట శ్రీనివాస్​ అనే వ్యక్తికి కోర్టు ఆర్డర్​ ఇవ్వడం కోసం మదన్ మోహన్ లంచం డిమాండ్​ చేశాడు. దీంతో శ్రీనివాస్​రూ. 5,000 వేలు ఇస్తానని ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శనివారం మధ్యాహ్నం మదన్​మోహన్​కు డబ్బులు ఇచ్చేందుకు కోర్టు వద్దకు వచ్చాడు. డబ్బులను ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ్ కుమార్​కు ఇవ్వాలని మదన్ మోహన్ చెప్పడంతో, శ్రీనివాస్​రూ.5,000 వేల క్యాష్​ ను అరుణ్​కుమార్​కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

ACB officials arrested Two persons who is working at KukatPalli Court

Latest Updates