అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నరసింహారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశారు. హైదరాబాదులోని మహేంద్ర హిల్స్‌లోని ఆయన ఇంటితో పాటు.. మరో 19 చోట్ల సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని డీడీ కాలనీ, ఉప్పల్ ఏసీపీ కార్యాలయం, అంబర్ పేట్ లతో పాటు వరంగల్, కరీంనగర్, నల్లగొండ, అనంతపూర్‌లలో కూడా ఏకకాలంలో రైడ్ చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

For More News..

రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు రిటైర్.. వాళ్లు ఎవరంటే?

సీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్‌లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు

రాష్ట్రంలో మరో 2,296 కరోనా పాజిటివ్ కేసులు

Latest Updates