కడప ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ దాడులు

కడప జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో  ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న 15 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.  వారి నుంచి రూ. 90 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా పనిచేస్తున్న ఏజెంట్లు ప్రజల నుంచి అధిక డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం.  వీరిపై కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందిస్తామని చెప్పారు.

Latest Updates