లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ బంజారాహిల్స్ ఎస్ఐ

హైద‌రాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ పోలీసు అధికారి. న‌గరంలోని బంజారాహిల్స్ పీఎస్ లో ‌ ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్రనాయక్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు విషయం లో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏపీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు రవీంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు రవీంద్ర నాయక్ ను విచారిస్తున్నారు. షేక్ పెట్ మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పై కూడా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారుల దాడులు నిర్వ‌హించారు.

Latest Updates