మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచంపై స్పందించిన ఏసీబీ అధికారులు

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ‌ మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్య‌వ‌హారంలో ఏసీబీ అధికారులు స్పందించారు.

శేరిలింగంపల్లి కి చెందినలింగ మూర్తి ఫిర్యాదు తో సోదాలు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 2020 ఫిబ్రవరి 29 న, ఆయనతో పాటు మరో నలుగురు 112 ఎకరాల విస్తీర్ణంలో భూమిని కొనుగోలుకు ప్ర‌య‌త్నించారు. కొనుగోలులో ఎన్వోసీ కోసం ప్ర‌య‌త్నించార‌ని, ఎన్వోసీ ఇచ్చేందుకు అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్ లంచం డిమాండ్ చేశారు .

నిషేధిత భూముల జాబితాలో భూమి ఉన్నందున ఎన్వోసీ కోసం కోసం భాదితుడు జులై 31న‌ గడ్డం నగేష్ కు 1 కోట్ల 12 లక్షలు అందజేశాడు. ముందుగా ఒప్పందం ప్ర‌కారం ఎక‌రానికి 1ల‌క్ష చొప్పున మొదట విడతగా ఫిర్యాదుదారుడి నుండి19.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ తీసుకున్నాడు.

జులై 7 తేదీన గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి మరో సారి 20.5 లక్షలు లంచం తీసుకున్నాడు. మిగిలిన రూ. 72 లక్షల లంచం డబ్బులు, కోలా జీవన్ గౌడ్ కి బాధితుడు బదిలీ చేశాడు. భూమి రిజిస్ట్రేషన్ కోసం గడ్డం నగేష్ ఫిర్యాదుదారుడి నుండి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నాడు. జులై 31న జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి రూ.5ల‌క్ష‌లు తీసుకున్న‌ట్లు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.

అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేష్ తో పాటు జూనియ‌ర్ అసిస్టెంట్ వ‌సీమ్ అహ్మ‌ద్, ఆర్డీవో అరుణా రెడ్డి సైతం ఇంట్లో సోదాలు చేసిన‌ట్లు, సోదాల్లో రూ. 28 లక్షలు నగదు, అర కిలో బంగారంతో పాటు పలు భూ డాక్యుమెంట్లు, కోలా జీవ‌న్ గౌడ్ ఇంట్లో ల్యాండ్ డాక్యుమెంట్లను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Latest Updates