ఉద్యోగం వదులుకునే ఉద్యోగులకు యాక్సెంచర్ ఆఫర్..7నెలల వేతనాన్ని ఇస్తున్నట్లు ప్రకటన

కరోనా కారణంగా అనేక సంస్థలు నష్టాల బాటిన పట్టిన విషయం తెలిసిందే. ఆదాయం లేకపోవడంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఉద్యోగుల పనితీరు పేరుతో వారిని విధులనుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో ఐటీ దిగ్గజం యాక్సెంచర్ పనితీరు ఆధారంగా 5శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో యాక్సెంచర్ ఉద్యోగులు వదులుకునే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. తాజా లే-ఆఫ్స్ ప్రభావం పడిన వారికి ఏడు నెలల వేతనం అందిస్తోంది. ఇందులో మూడు నెలల కాలం నోటీస్ పీరియడ్ కాగా, మరో నాలుగు నెలలు అదనంగా చెల్లించనున్నట్లు ఇండియాటైమ్స్ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

సాధారణంగా ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోతే రెండు నుంచి మూడు నెలల నెలల వేతనాలు మాత్రమే చెల్లిస్తారు. అయితే ఐటీ సర్వీస్ గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ మాత్రం మూడు నెలల కాలాన్ని నోటీస్ పీరియడ్‌గా, మరో నాలుగు నెలల అదనపు వేతనం ఇస్తోంది.

Latest Updates