కారు డ్రైవర్ బలుపు : యాక్సిడెంట్ చేసి పారిపోయాడు

యాక్సిడెంట్ జరిగితే అయ్యో పాపం అనేవాళ్లే చాలా తగ్గిపోయారు ఈ రోజుల్లో. యాక్సిడెంట్ చేసినవాడైతే.. సీసీ కెమెరాలో వెతికి పట్టుకుంటే తప్ప దొరకడం లేదు. ఎదురుగా వచ్చినవారికి యాక్సిడెంట్ చేస్తే.. అయ్యోపాపం.. వారికేమైందో అన్న ఆలోచనే లేకుండా.. పారిపోతున్నారు దుండగులు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోనూ ఈ తెల్లవారుజామున ఇలాంటి సంఘటనే జరిగింది.

సికింద్రాబాద్ ప్యాట్నీ  సెంటర్ లో మే 1 బుధారం తెల్లవారుజామున 3 గంటల 18 నిమిషాలకు ఓ కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ జంక్షన్ ఐనప్పటికీ… అత్యంత వేగంతో దూసుకొచ్చింది ఓ వెహికల్. మరో వైపు నుంచి వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఆటో బోల్తా కొట్టింది. డ్రైవర్ ఎగిరిపడ్డాడు. ముగ్గురు ప్రయాణికులు ఆటోలో ఇరుక్కుని.. కష్టమ్మీద బయటకు వచ్చారు. అందిరికీ గాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న ఓ నలుగురు వచ్చి వారికి సాయం అందించారే తప్ప.. యాక్సిడెంట్ చేసిన కారు మాత్రం ఆగలేదు. ఆగకుండా అలాగే వెళ్లిపోయాడు.

సీసీటీవీ కెమెరాల్లో ఈ యాక్సిడెంట్ రికార్డైంది. గాయాలైన వారు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ దారిలో ఉన్న అన్ని సీసీ టీవీల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు.

Latest Updates