ర్యాష్ డ్రైవింగ్‌తో యాక్సిడెంట్ చేసిన సౌతాఫ్రికా యువకుడు

ఓ వ్యక్తికి గాయాలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ విద్యార్థి తన బైక్ తో ఈ యాక్సిడెంట్  చేశాడు. బైక్ పై విపరీతమైన స్పీడ్ తో వచ్చి… ముందుగా సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో బైక్ ఓ మార్బుల్స్ షాప్ లోకి దుసుకెళ్లింది. ప్రమాదం జరిగిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

సౌతాఫ్రికా విద్యార్ధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు తరచుగా ఇలా రాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తికి గాయాలవగా అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

Latest Updates