భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం: ముగ్గురు మృతి..శంకర్ కి గాయాలు

‘భారతీయుడు2 షూటింగ్​లో  ప్రమాదంముగ్గురు మృతి
భారీ క్రేన్​ తెగిపడి ఘోరం కమల్​హాసన్​ క్షేమం
సినిమా యూనిట్​పై     కుప్పకూలిన భారీ క్రేన్​
డైరెక్టర్​ శంకర్​కు తీవ్ర గాయాలు మరో 10 మందికి గాయాలు
ఆ టైంలో అక్కడే ఉన్న కమల్​

చెన్నై:కమల్​హాసన్​ హీరోగా ఎన్​.శంకర్​ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్​లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్​ కుప్పకూలి మీదపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డైరెక్టర్​ శంకర్​తో పాటు మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శంకర్​ కాలు విరిగింది. కొన్నిరోజులుగా చెన్నైలో సమీపంలోని పూనమల్లి దగ్గర ‘భారతీయుడు 2’ షూటింగ్ జరుగుతోంది. బుధవారం రాత్రి షూటింగ్​  కొనసాగుతుండగా భారీ క్రేన్  చిత్ర బృందంపై పడింది. ఇద్దరు అసిస్టెంట్​ డైరెక్టర్లు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డైరెక్టర్​ శంకర్​తో పాటు మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడే సెట్​లో హీరో కమల్​హాసన్​తో పాటు  హీరోయిన్​ కాజల్​ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates