మెట్రో స్టేషన్ లో ప్రమాదం: ట్రాక్ పై పడ్డ ప్రయాణికుడు!

ఢిల్లీ లోని మెట్రో రైల్వే ట్రాక్ పై పడిపోయాడు ఒకతను. ఈ ఘటనలో.. అతడి కుడి కాలి పాదం పూర్తిగా కోల్పోయాడు. గురువారం పొద్దున ఢిల్లీ లోని దిల్షాద్ గార్డెన్ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. కేంద్ర జౌళిశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న జఖారియా కోషే (57) తన భార్యతో కలిసి మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో రైలు వస్తుండగా ట్రాక్ పై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. సీసీటీవీని పరిశీలించిన పోలీసులు ఇది ఆత్మహత్యా యత్నమని తెలిపారు.  బాధితుడిని హాస్పిటల్ కు తరలించగా అతడి కుడికాలు పాదం పూర్తిగా కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. ఎడమకాలికి గాయాలు అయినట్లు చెప్పారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates