మొహర్రం ఉత్సవాల్లో అపశృతి: గోడ కూలి కొందరికి గాయాలు

కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు మొహరం ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పీర్ల చావిడి దగ్గర గోడ కూలి 20 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  రాత్రి జరిగిన పీర్ల పండుగలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీర్లను చూసేందుకు పక్కనే ఉన్న గోడ ఎక్కి కూర్చున్నారు. గోడ పాతది కావడంతో బరువు ఆపలేక కూలిపోయింది. దీంతో గోడపై ఉన్నవాళ్లతో పాటు కింద ఉన్నవారిపై మట్టిపెళ్లలు పడ్డాయి. దీంతో గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Latest Updates