ఫ్లై ఓవర్ గోడెక్కిన కారు.. సెల్ఫీల కోసం జనం ఆరాటం

ఫ్లై ఓవర్ పై కారును రివర్స్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన మినీ ఆటో ఢీకొట్టడంతో కారు ఫ్లై ఓవర్ పై గోడపై సగంలో ఆగింది. ఈ ఘటన విజయవాడ సమీపంలోని రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ వద్డ జరిగింది. ఆటో ఢీకొన్న వెంటనే కారు రోడ్ వెంబడి గోడను ఢీకొని  గోడ ఎక్కింది. కారు కింద పడిపోతుందనే భయంతో ప్రమాదం గుర్తించిన కారులోని ప్రయాణికులు వెంటనే దిగి తమ ప్రాణాలు దక్కించుకున్నారు.

మరోవైపు ఫ్లై ఓవర్ గోడ ఎక్కిన కారును ఆ దారిలో వెళుతున్న వాహనదారులు, స్థానికులు  అదో వింతగా ఆశ్చర్యపోతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Latest Updates