వాహనాల మీద పడ్డ బండరాళ్ల ట్రక్కు.. 13 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధూప్‌గురి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా.. మరో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని జల్పాయిగురి సదర్ హాస్పిటల్‌కు తరలించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బండరాళ్లతో వెళ్తున్న ట్రక్కును.. పొగమంచు వల్ల సరిగా కనిపించక దాని వెనుకే వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో మరో రెండు వాహనాలు ట్రక్కున ఢీకొన్నాయి. ట్రక్కు అదుపుతప్పి ఈ మూడు వాహనాలపై బోల్తాపడింది. దాంతో ట్రక్కులోని బండరాళ్లు ఈ మూడు వాహనాలపై పడ్డాయి. దాంతో వాటిలో ప్రయాణిస్తున్న 13 మంది మరణించగా.. 18 మంది గాయపడ్డారు. ట్రక్కు ఈ మూడు వాహనాలతో పాటు దాని ముందున్న మరో లారీని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు వాహనాలు ద్వంసమయ్యాయి.

‘ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే ధూప్‌గురి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు అతని బృందం అక్కడికి చేరుకుంది. భారీ క్రేన్ల సాయంతో వాహనాలను తొలగించారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. స్థానికుల సాయంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం. ట్రాఫిక్ జాం క్లీయర్ చేయబడింది. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. చనిపోయిన వారిలో ముగ్గురు పురుషులు, ఆరుగులు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు’ అని జల్పాయిగురి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సుమంత్ రాయ్ తెలిపారు.

For More News..

రిపబ్లిక్ డే పరేడ్​కు లేడీ ఫైటర్​ పైలట్

పెట్రోల్ ధర పైపైకి.. రాజధానిలో ఆల్ టైం హై మార్క్..

పెండ్లి మొక్కులు తీర్చుకుని వస్తుండగా కొత్త జంటకు యాక్సిడెంట్

అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం.. ఏదో పని చేసుకోవాలి

Latest Updates