దారుణం: ప్రాణాలు పోతుంటే సెల్ఫీలు దిగుతున్నారు

ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో త్రీవగాయాలై  సాయం కోసం ఎదురు చూస్తుంటే..ఆ యువకుడి నిస్సహాయతను, అనుభవిస్తున్న క్షోభను గుర్తుగా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు స్థానికులు.

ఒడిశా భద్రాక్ జిల్లా సహపూర్ చౌక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌ పై  ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన సిమెంట్ లోడ్ తో ఉన్న లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. ఓ వైపు  రక్త మోడుస్తున్నా బాధితుడు సాయం కోసం ఎదురు చూస్తుంటే.. స్థానికులు ఎటువంటి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. సెల్ఫీలు దిగితూ, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ప్రమాదం జరిగిన 30నిమిషాల తరువాత సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తీసుకొచ్చుంటే బ్రతికేవాడని  వైద్యులు తెలిపారు. ప్రమాదంపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates