పండక్కి ఊరెళ్తుండగా ప్రమాదం.. తల్లీకొడుకు మృతి

బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన వాళ్లు పండక్కి సొంతూరు తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా సానిపల్లికి చెందిన జక్క నరసమ్మ భర్త పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం మహారాష్ర్టకు వెళ్లారు. కాగా.. దసరా పండగ సమీపిస్తుండటంతో.. కుటుంబంతో కలిసి డీసీఎం వ్యాన్‌లో సొంతూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో కామారెడ్డి సమీపంలోని ఆశోక్ దాబా వద్ద డీసీఎం ఆపి మూత్రవిసర్జన కోసం నరసమ్మ తన కొడుకు శంకర్‌తో కలిసి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన తల్లీకొడుకులను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీకొడుకులిద్దరూ చనిపోయారు. మరో రెండు గంటల్లో సొంతూరుకు చేరుతారనగా ఈ ప్రమాదం జరగడంతో మృతుల బంధువులు తీవ్రంగా విలపిస్తున్నారు. పండుగ పూట ఇంటికెళ్తుతూ మార్గమధ్యంలో చనిపోవటంతో విషాదం నెలకొంది.

For More News..

ఫెస్టివల్​ షాపింగంతా ఆన్​లైన్​లోనే

తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు

జోష్ లేని దసరా.. పల్లెలు, పట్నంలో కానరాని సంబురం

Latest Updates