తండ్రికి పిండ ప్రదానం చేస్తూ కొడుకు మృతి

కొత్తపల్లి : తండ్రికి పిండ ప్రదానం చేయడానికి వెళ్లిన కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కరీంనగర్ లోని హిందూపురికాలనీకి చెందిన అన్ రెడ్డి కొండల్ రెడ్డి12 రోజుల క్రితం చనిపోయాడు. అతడి కొడుకులు పురేందర్ రెడ్డి (48), ప్రణవేందర్ రెడ్డి (45) పిండాలను చెరువులో కలపడానికి కొత్తపల్లికి వచ్చారు. చెరువులో దిగి పిండాలు కలుపుతుండగా పురేందర్ రెడ్డి కాలుజారి పడ్డాడు. చేపలు పట్టేవాళ్లు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు

Latest Updates