ప్రాణాలు తీస్తున్న సిగ్నల్ లేని రోడ్లు

ప్రమాదాలకు నిలయం బాలాపూర్ చౌరస్తా

మీర్ పేట్, వెలుగు: పొలీసులు, మున్సిపల్ శాఖల మధ్య సమన్యయ లోపం కారణంగా విలువైన ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నగరంలో ఏదో ఒక చౌరస్తా వద్ద సిగ్నల్ లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బాలాపూర్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క బస్టాండ్ , మరోపక్క ఆటో స్టాండ్ ఆక్రమణ. మరో పక్క వైన్స్, బార్లు, రెస్టారెంట్లు రోడ్ల పైనే ఉండటం వల్ల ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

యూటర్న్ తోనే సమస్య

యూటర్న్ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. తాజాగా మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు చనిపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ట్రాఫిక్ సిగ్నల్స్​ ఏర్పాటు చేయడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. యూటర్న్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతోందని ఆర్టీసీ డ్రైవర్లు సైతం అంటున్నారు. స్థానిక ఎంపీటీసీలు అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. అయినా వారు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి చౌరస్తాలో ప్రమాదాలును నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకొంటాం…

“బాలాపూర్ చౌరస్తా లో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం, బైక్ పైన వచ్చే వారు జాగ్రత్త వహించాలి. బారికేడ్ల సంగతి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం . ట్రాఫిక్ డీసీపీ,ఏసీపీని తీసుకొచ్చి ప్రమాదాలు జరిగే స్పాట్లను చూపిస్తాం . ప్రజల ఇబ్బంది వాస్తవమే. యూటర్ను లో కానిస్టేబుళ్లను పెడుతున్నాం. వైన్స్, బార్, బస్టాండు ఒకే చోట ఉండటం వల్ల ఇబ్బంది అవుతోంది. అర్సీఐ రోడ్డు వెడల్పు లేకపొవడం బస్సుల యూటర్న్​కు ఇబ్బంది అవుతోంది. చౌరస్తా లో లేబర్ అడ్డా తొలగిస్తే ట్రాఫిక్ సమస్య ఉండదు. సమస్యలను పరిష్కరిస్తాం.” – R B నా యక్ ట్రాఫిక్ సీఐ, వనస్థలిపురం

Latest Updates