కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువే: డాక్టర్ మైక్ ర్యాన్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా  పూర్తిగా అంతం చేసే అవకాశాలు తక్కువేనని చెప్పింది. దీనికి సంబంధించి ఆ సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా రెండోసారి అది చెలరేగకుండా చేయొచ్చని తెలిపారు. అలా చేస్తే లాక్‌ డౌన్‌ల నుంచి కూడా ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు డాక్టర్ మైక్ ర్యాన్.

Latest Updates