ప్రియుడితో కలిసి భర్తను సజీవదహనం చేసిన భార్య

తాగివేధిస్తున్న భర్తను ప్రియుడితో చంపించింది ఓ భార్య. గత నెల హత్య జరుగగా నిందితులు పరారీలో ఉన్నారు. అయితే పరారీలో ఉన్న నిందితులను వనస్థలీపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.  రమేష్, స్వప్న దంపతులు వనస్థలీపురంలో నివసిస్తున్నారు. రమేష్ తరచూ తాగి వచ్చి స్వప్నను వేధిస్తుండటంతో ఆమె ప్రియుడు వెంకటేష్ తో కలిసి రమేష్ ను అంతమొందించడానికి ప్లాన్ చేశారని చెప్పారు పోలీసులు. ప్లాన్ లో భాగంగా… స్వప్న సొంత ఊరికి వెళ్లిన సమయంలో రమేష్ ను వెంకటేష్ చంపాలని స్కెచ్ వేశారు… అందులో భాగంగా…  గతనెల 26న రమేష్ గుడిశలో నిద్రపోతుండగా అతనిపై పెట్రోల్ పోసి సజీవదహానం చేశాడు వెంకటేష్. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నింధితులని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates