పోలీస్‌ స్టేషన్‌పై నుంచి దూకి పారిపోయే ప్రయత్నం

accused-jumped-on-chityala-police-station-nalgonda

మర్డర్ కేసులో నింధితుడైన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ పై నుంచి దూకాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల పీఎస్ లో జరిగింది. ఆగస్ట్ 2019న వెలిమేడు గ్రామంలో అంశాల వేణును విజయ్ అనే వ్యక్తి చంపాలని చేశాడు. దోంతో పోలీసులు విజయ్ ను A1గా అరెస్ట్ చేశారు. అయితే ఆదివారం అతన్ని DPTS కు తరలిస్తుండగా విజయ్ పారిపోవాలని చూశాడు. ఈ ప్రయత్నంలో నిందితునికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. నిందితుని బంధువులు పోలీసులు కొట్టడంవల్లే విజయ్ పారిపోవడానికి ప్రయత్నించాడని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

Latest Updates