భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు నిందితులు

డాక్టర్ హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తు మధ్య పోలీస్ వాహనాల్లో తరలించారు. నిందితులను తరలిస్తుండగా ఆందోళనకారులు వాహనాలకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వాహనాలపై రాళ్లు విసిరారు. అంతేకాదు నిందితులను శిక్షించకుండా.. ప్రజలపై లాఠీఛార్జ్ చేయడమేంటని ఆందోళనకారులు ప్రశ్నించారు. దీంతో షాద్‌నగర్ పరిసరాలన్నీ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

అంతకు ముందు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తహశీల్దార్ నిందితులకు 14రోజులు రిమాండ్ విధించారు.

Latest Updates