ఏస్ ఆఫ్ స్పేస్-2 విన్నర్ సల్మాన్

ఎంటీవీలో ప్రసారమైన రియాలిటీ షో ‘ఏస్‌‌ ఆఫ్‌‌ స్పేస్‌‌–2’. నటుడు, నిర్మాత వికాస్‌‌ గుప్తా  హోస్ట్‌‌ చేసిన ఈ షో ఫైనల్‌‌ ఎపిసోడ్‌‌ ఆదివారం ముగిసింది. హైదరాబాద్‌‌ నేపథ్యం కలిగిన సల్మాన్‌‌ జైది విన్నర్‌‌‌‌గా నిలిచాడు. ఫైనల్‌‌లో అద్నాన్‌‌ షేక్‌‌, బసీర్‌‌‌‌ అలీ, శ్రుతి సిన్హా, ప్రకృతి మిశ్రా, క్రిసాన్‌‌ బరేట్టో, రశామి జాలను ఓడించి సల్మాన్‌‌ ‘ఏస్‌‌ ఆఫ్‌‌ స్పేస్‌‌–2’ టైటిల్‌‌ సాధించాడు. టైటిల్‌‌తోపాటు ఐదు లక్షల రూపాయల క్యాష్‌‌ప్రైజ్‌‌ కూడా గెలుచుకున్నాడు. ‘‘షోలో ఎంతోమంది సెలబ్రిటీ పార్టిసిపెంట్స్‌‌ ఉన్నారు. వాళ్లలో కొందరికి రియాలిటీ షోల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉంది. దీంతో నేను ఎక్కువ కాలం షోలో ఉండలేననుకున్నారు. అయితే ప్రేక్షకుల అభిమానమే నన్ను విన్నర్‌‌‌‌ను చేసింది” అని సల్మాన్‌‌ జైది చెప్పాడు. ‘ఏస్‌‌ ఆఫ్‌‌ స్పేస్‌‌’ కూడా బిగ్‌‌బాస్‌‌ షోలాంటిదే. ఒక ఇంట్లో, పార్టిసిపెంట్స్‌‌ అంతా కొద్ది రోజులు ఉండాలి. అయితే రోజురోజుకు హౌజ్‌‌లో ప్లేస్‌‌ తగ్గిపోతూ ఉంటుంది. తక్కువ స్థలంలోనే అడ్జస్ట్‌‌ అవ్వడం, స్థలం కోసం టాస్క్‌‌లు వంటివి ఈ షో కాన్సెప్ట్‌‌.

Latest Updates