మెగాస్టార్‌‌ బర్త్‌డే.. ఆచార్య ఫస్ట్‌ లుక్ రిలీజ్‌

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి శనివారంతో 65వ పడిలోకి అడుగుపెట్టారు. తనదైన మెస్మరైజింగ్ నటన, స్టైలిష్ డ్యాన్స్‌, అదిరే పంచ్ డైలాగులతో తెలుగు ప్రేక్షకుల్లో చిరు మరచిపోలేని ముద్ర వేశారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మూవీలో చిరు నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా మిగతా సినిమాల లాగే ఈ మూవీ షూటింగ్‌కూ బ్రేక్ పడింది. మెగాస్టార్ బర్త్‌ డే సందర్భంగా మూవీ యూనిట్‌ టైటిల్‌తోపాటు చిరు లుక్‌ను విడుదల చేసింది.

యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రి లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదలవుతుందని ఈ పోస్ట్‌లో చరణ్ చెప్పారు. ఈ మోషన్ మోస్టర్‌‌లో చిరు లుక్ ఆకట్టుకుంటోంది. సామాజిక కార్యకర్తగా మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాలో కీలక శాతం సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారని సమాచారం. ఈ మూవీలో చిరు పక్కన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

Latest Updates