‘ఆచార్య’ అప్‌‌డేట్ వచ్చేసింది..

మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌ డేట్ వచ్చేసింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌‌ని ప్రకటించారు. అభిమానులంతా ఆశించినట్లుగానే ఆగస్టు 22న మెగాస్టార్ బర్తడే సందర్భంగా ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ కూడా చాలా అట్రాక్టివ్‌ గా ఉంది. చిరంజీవి నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారని మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ఈ పోస్టర్లో పిడికిలి బిగించిన చిరంజీవి చేయి, ఆ చేతికి చుట్టిన రెడ్ కలర్ క్లాత్ రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. ఓ సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ అనుకోకుండా ‘ఆచార్య’ అని చెప్పారు తప్ప టైటిల్‌ ని ఇంతవరకు అఫీషియల్‌ గా ప్రకటించలేదు. దీంతో ‘ఆచార్య’ టైటిల్‌ నే కన్‌‌ఫర్మ్ చేశారా లేక మరో టైటిల్ రిలీజ్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్‌ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest Updates