హైదరాబాద్ మహిళపై విశాఖలో యాసిడ్ దాడి

విశాఖపట్నంలో ఓ మహిళపై బుధవారం యాసిడ్ దాడి జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి యాసిడ్ పోసి పరారయ్యాడు. గాజువాకలోని సమతా నగర్‌లో ఈ దారుణం జరిగింది.

హైదరాబాద్ నుంచి ఓ ఫంక్షన్ కోసం శిరీష (30) అనే మహిళ బుధవారం ఉదయమే విశాఖపట్నం వచ్చింది. గాజువాకలోని సమతా నగర్‌లో ఆమె ఒంటరిగా నడిచి వెళ్తుండగా.. నడి రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఆమెను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరుగుతోంది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయమే హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెపై యాసిడ్ దాడి జరిగిందంటే ఎవరో తెలిసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో మరో మహిళ ఈ దాడి చేయించినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది.

Latest Updates