యాసిడ్ ఫ్యాక్టరీ గ్యాస్ పైప్ లీక్: ఏడుగురు కూలీలు మృతి

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. సీతాపూర్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఐన ఘటనలో ఏడుగురు కూలీలు చనిపోయారు. కార్పెట్ ఫ్యాక్టరీ, యాసిడ్ ఫ్యాక్టరీ మధ్య గ్యాస్ పైప్ లీకవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్ సైతం ఘటన స్థలాన్ని పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.

Latest Updates