ఫోన్ లో ఎక్కువగా మాట్లాడితే మొటిమలు వస్తాయ్!!

సిల్లీ జోక్​లా ఉందికదూ టైటిల్? ఫోన్​కు మొటిమలకు అసలు సంబంధమే లేదు కదా? అసలు ఫోన్లు రాకముందు కూడా చాలా మంది మొటిమల సమస్యలతో  బాధపడ్డారు కదా.. అంటారా? మీరనుకుంటున్నవన్నీ కరక్టే. కానీ.. పైన టైటిల్లో చెప్పిన మాట కూడా తప్పేం కాదు. అతిగా ఫోన్లో మాట్లాడితే మొటిమలు రావడం ఖాయం. ఎందుకంటే.. ఫోన్​ మాట్లాడేటప్పుడు ముఖానికి దగ్గరగా, చెవులకు, చెంపలకు ఆనించి మాట్లాడతాం. దీనివల్ల అప్పటికే ఫోన్​ మీద తిష్టవేసిన బ్యాక్టీరియా మన ముఖంపైకి ట్రాన్సఫర్​ అవుతుంది. మొటిమలు, రకరకాల చర్మ సమస్యలు రావడానికి బ్యాక్టీరియా కూడా కారణమనే విషయం నిజమే కదా? ఇప్పుడు చెప్పండి.. ఫోను అదే పనిగా ముఖానికి ఆనించి మాట్లాడడం వల్ల మొటిమలు, స్కిన్​ అలర్జీలు రావంటారా?  అందుకే ఫోన్లో మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చెవికి, చెంపలకు కాస్త దూరంగా పెట్టుకొని మాట్లాడండి. దీని
వల్ల ఎటువంటి సమస్య ఉండదు.

ప్రతి సీజనూ మనకి ఎన్నో అనుభూతలనిచ్చి వెళ్తుంది. అందులో వింటర్​కు బోలెడంత స్పెషాలిటీ ఉంది. చలికాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అలానే ‘అమ్మో చలికాలం’ అనుకునే వాళ్లూ ఉంటారు. ఇంకొంతమందికైతే వింటర్​ను ఎంజాయ్​ చేయాలని చాలా ఆశ ఉంటుంది. కానీ వాళ్ల ఆరోగ్యం, శరీరం సహకరించదు. చలికాలం చూపించే ఎఫెక్ట్​కు భయపడిపోయి, ఆ కోరికనే చంపేసుకుంటారు. నిజానికి అంత కంగారు పడాల్సిన పనేమీ లేదు. కొన్ని చిన్నచిన్న చిట్కాలను ఫాలో అయితే వింటర్​ను బాగా ఎంజాయ్​ చేయొచ్చు.

Latest Updates