ఓటేసిన ప్రముఖులు…

మహారాష్ట్ర, హర్యానాలోని అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ పలువురు పోలింగ్ బూత్ లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు ,గోరక్ పూర్(యూపీ) బీజేపీ ఎంపి రవికిషన్ ముంబైయి గోరేగావ్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.అంధేరి (పశ్చిమ)నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లో  నటి పద్మిని కొల్హాపురే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

గోండియా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో సీనియర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు ప్రఫుల్ పటేల్, ఆయన భార్య వర్ష ఓటు వేశారు.

నాగ్ పూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆయన భార్య కాంచన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముంబైలో ఓటు వేశారు. బీజేపీ, శివసేన కూటమి 225 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని అంచనా  వేస్తున్నట్లు చెప్పారు.

హర్యానాలోని చార్కి దాద్రి నియోజకవర్గంలోని బాలాలి గ్రామంలోని పోలింగ్ బూత్‌లో రెజ్లర్లు బబితా ఫోగాట్, గీతా ఫోగాట్ అలాగే వారి కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నిర్పేందర్ సింగ్ సంగ్వాన్, జెజెపి అభ్యర్థి సత్పాల్ సంగ్వాన్‌, బీజేపీ నుంచి బబితా ఫోగాట్ పోటీ చేస్తున్నారు.

Latest Updates