ఎన్నికల్లో పోటీకి క్వాలిఫికేషన్ గ్లామరే !

ఎంటర్టైన్‌‌మెంట్‌‌ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది లోక్సభకు పోటీ చేయడం ఎన్నికల్లో విశేషం.ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతోపాటు రీజనల్పార్టీ అయిన తృణమూల్కూడా పిలిచి మరీ టిక్కెట్లిచ్చాయి. సినిమా, టీవీ రంగాలకు చెందినవారు ఇప్పటికే జనంలో ప్రత్యేక గుర్తింపుతో ఉంటారు.వీళ్లకుండే ఏకైక క్వాలిఫికేషన్‌‌గ్లామర్ఇమేజే! కొత్తగా ఓటర్లకు పరిచయం చేయాల్సిన పని ఉండదు.పార్టీ కండువా కప్పుకొని కార్యకర్తలతో పాటుగా ర్యాలీలు నిర్వహిస్తే చాలు. భరోసాతోనే ధర్మేంద్రవారసుడు సన్నీ డియోల్ , రంగీలా ఊర్మిళ లాంటివాళ్లు పొలిటికల్అరంగేట్రం చేశారు

 ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బాలీవుడ్ స్టార్లు ఎక్కువ మందేకనిపిస్తారు. కిందటిసారి తో పోలిస్తే పోటీ చేస్తున్నసిన్మా స్టార్లు నెంబర్ పెరిగింది. డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఉత్తరప్రదేశ్ లోని మథురలో రెండోసారి అదృష్టా న్ని పరీక్షించుకుంటోంది. ఏప్రిల్ 18న అక్కడ పోలింగ్ ముగిసింది. అలనాటి మరో అందాల తార జయప్రద రాంపూర్ లో మూడోసారి బరిలో నిలిచింది. గతంలో రెండు సార్లు సమాజ్ వాది పార్టీ టికెట్ పై పోటీ చేసిన జయప్రద ఈసారి బీజేపీ తరఫున పోటీ చేసింది. పాత ప్రత్యర్థి ఆజంఖాన్ కు సవాల్ విసిరింది. ఏప్రిల్ 23నరాంపూర్ లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ కూడా బాలీవుడ్ స్టార్లను నిరా శపరచలేదు. రంగీలా అంటూ కుర్రకారును ఓ ఆట ఆడించి న ఊర్మిళా మటోండ్కర్ ముంబై నార్త్ లో నిలబెట్టింది. ఇక్కడ బీజేపీ కేండిడేట్ గా  గోపాల్ శెట్టి బరిలో నిలిచారు. ఏప్రిల్ 29 నముంబై నార్త్ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది.బీజేపీ రెబెల్ గా ముద్ర పడ్డ శత్రుఘ్న సిన్హా ఈసారి కాంగ్రెస్ కండువా కప్పుకుని పాత నియోజకవర్గమైన పట్నా సాహిబ్ బరిలో నిలిచారు. మే 19న ఇక్కడపోలిం గ్ జరగబోతోంది. అలాగే మరో బాలీవుడ్ ప్రముఖుడు రాజ్ బబ్బర్ యూపీలోని ఫతేపూర్ సిక్రీనుంచి పోటీ చేశారు. ఇక్కడ ఏప్రిల్ 18న పోలింగ్ ముగిసింది.

సినీ స్టార్లకు ప్రత్యేక ఐడెంటిటీ

సిన్మా స్టా ర్లకు టికెట్లు ఇవ్వడానికి దాదాపుగా అన్నిరాజకీయ పార్టీలు ఉత్సాహం చూపుతాయి. రాజకీయపార్టీలతో సంబంధం లేకుండా సిన్మా స్టార్లకు సమాజంలో ఆల్రెడీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.సహజంగా ఎవరైనా కొత్త కేండి డేట్ కు టికెట్ ఇస్తే నియోజకవర్గం లోని ప్రజలకు ఆ కేండిడేట్ కనెక్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. పూర్తిగా పార్టీ హవా మీదే ఆధారపడి ఆ కేండిడేట్ ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. అదే సిన్మా స్టార్ అయితే అప్పటికే ఒకఇమేజ్ ఉంటుంది. సిన్మా స్టార్ గా ప్రజలకు ఆల్రెడీకనెక్ట్ అయి ఉంటారు . ప్రచారంలో ఈజీగా చొచ్చుకుపోతారు. పార్టీ కేడర్ కంటే స్టార్ కున్న అభిమానులే ప్రచార కార్యక్రమాల సంగతి చూసుకుంటారు .రాజకీయ పార్టీకి పని తగ్గుతుంది. దీనికి తోడు మాస్ అప్పీల్ కూడా ఉంటుంది. పాలిటిక్స్ కు సంబంధంలేని వ్యక్తి కాబట్టి అవినీతి ఆరోపణలు, కుంభకోణాల వంటివేమీ ఉండవు. రాజకీయ ప్రత్యర్థులు టార్గె ట్ చేయడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. అంతేకాదు ఆ స్టా ర్ దేశభక్తి ప్రబోధించే కేరక్టర్లు వేస్తే సామాన్యప్రజల దృష్టిలో బోనస్ కింద లెక్క. సరిహద్దుల్ లోశత్రుదేశాల మూకలపై వీరోచితంగా ఫైట్స్ చేసే ఆర్మీఆఫీసర్ పాత్ర వేసి ఉంటో ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఓట్లు కురిపిస్తాయని రాజకీయపార్టీలు లెక్కలు వేసుకుంటాయి.

సన్నీ టఫ్ ఫైట్

గురుదాస్ పూర్ లో కాంగ్రెస్ నుంచి సన్నీ డియోల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు . సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్ ఇక్కడ నుంచి మరోసారి బరిలో నిలిచారు. సన్నీ ఎంత పెద్ద స్టార్ అయినా గెలుపుతనదేనన్న ధీమా వ్యక్తం చేశారు సునీల్. గురుదాస్ పూర్నియోజకవర్గా నికి సంబంధించి సన్నీ డియోల్ కుఎలాంటి నాలెడ్జ్ లేదన్నారు . ‘‘అటల్ బిహారీ వాజ్ పేయికి మా తండ్రి ధర్మేంద్ర అండగా ఉన్నట్లు ,దేశాభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకితాను అండగా ఉంటా ”నని సన్నీ డియోల్ చెప్పారు .రాజకీయాలకు తాను కొత్త కానీ, తమ కుటుంబానికిమొదటి నుంచీ బీజేపీతో అనుబంధం ఉందన్నారు .

వినోద్ ఖన్నాతో గురుదాస్ పూర్ పాపులర్

గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం అలనాటి హిందీ హీరో వినోద్ ఖన్నాతో ఎక్కువగా పాపులర్ అయింది. ఈ నియోజకవర్గం నుంచి వినోద్ ఖన్నా నాలుగుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998లో ఆయన తొలిసారిగా ఇక్కడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వా త 1999 లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఆయన గెలిచారు. కేంద్రంలో టూరిజం మంత్రి అయ్యారు . 2004 లోమూడోసారి కూడా వినోద్ ఖన్నా విజయం సాధించారు. అయితే 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేండిడేట్ ప్రతాప్ సింగ్ బజ్వా చేతిలో ఓడిపోయారు. ఆ తర్వా త 2014 లో జరిగిన ఎన్నికల్లో వినోద్ ఖన్నాఇదే సెగ్మెంట్ నుంచి నాలుగోసారి విజయంసాధించారు. ఆ తర్వా త వినోద్ ఖన్నా చనిపోవడంతో 2017 లో బై ఎలక్షన్ జరిగింది.ఈ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కేండిడేట్ సునీల్ జఖడ్ విజయం సాధించారు. ఆరో విడతలోభాగంగా మే 19న గురుదాస్ పూర్ లోపోలింగ్ జరగబోతోంది.

 

Latest Updates