జనతా కర్ఫ్యూ భేష్.. ఇండియాపై అమెరికా పొగడ్తలు

వాషింగ్టన్: కరోనా మరింత విస్తరించకుండా ఇండియా ప్రైమ్​ మినిస్టర్​ నరేంద్రమోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇండియా ప్రజలంతా కలసి కట్టుగా జనతా కర్ఫ్యూను సక్సెస్​ చేయడం స్ఫూర్తిదాయకమని, ఈ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు అందించిన వారి సేవలు గొప్పవని కొనియాడింది. ‘‘కరోనా వైరస్​కు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ, మెడికల్​ సర్వీసులు అందిస్తున్న వారికి సంఘీభావంగా ఇండియా జనమంతా కలసికట్టుగా ముందుకురావడం స్ఫూర్తిదాయకం”అంటూ సౌత్, సెంట్రల్​ ఆసియా తాత్కాలిక అసిస్టెంట్​ సెక్రెటరీ ఆఫ్​ స్టేట్​అలీస్ జి వెల్స్ ఓ ట్వీట్​ చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తున్న వారికి మద్దతుగా జనమంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ, డ్రమ్స్​ వాయిస్తున్న ఓ వీడియోను ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో షేర్​ చేయగా.. ఆమె దానిని రీ ట్విట్​చేశారు. మరోవైపు అమెరికాలో ఇండియా అంబాసిడర్​ తరన్​జిత్​ సింగ్​సంధూ సోమవారం అమెరికాలోని ఇండియా కంపెనీల ప్రతినిధులతో కరోనా ఔట్​బ్రేక్​పై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఇండియా కంపెనీలు స్థానికులకు సహాయం అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించి కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్టు సంధూ చెప్పారు.

Latest Updates