రివ్యూ: యాక్షన్

నటీనటులు: విశాల్,తమన్నా, యోగిబాబు,ఐశ్వర్య లక్ష్మీ,కబీర్ సింగ్,అకాంక్ష పూరి,రాంకీ,భరత్‌రెడ్డి తదితరులు
సంగీతం: హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: డుడ్లీ

నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్.సి

రిలీజ్ డేట్: నవంబర్ 15,2019

కథ
ఒక బాంబ్ బ్లాస్ట్‌లో తన కుటుంబ సభ్యురాలిని కోల్పోతాడు కల్నల్ సుభాష్ (విశాల్). అతని తండ్రి సీఎం. ఈ బ్లాస్ట్ వెనుక సుభాష్ అన్న శ్రావణ్ (రాంకీ) ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. శ్రావణ్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. బాంబ్ బ్లాస్ట్, తన కుటుంబసభ్యుల మరణం వెనుక ఎవరున్నారనే తీగ కదిలిస్తాడు సుభాష్. డొంక కదిలి ప్రొఫెషనల్ కిల్లర్ కైరా (ఆకాంక్షా పురి) నుంచి పాకిస్తానీ టెర్రరిస్ట్ మాలిక్ (కబీర్ దుహాన్ సింగ్) దాకా మూలాలు వెళ్తాయి. సుభాష్ తన వ్యక్తిగత పగ తీర్చుకోవడంతో పాటు, దేశానికి ఎలా పేరు తెచ్చాడనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

ఇలాంటి యాక్షన్ సినిమాల్లో అలవోకగా నటించేసే విశాల్..మరోసారి రాణించాడు.చేజింగ్,యాక్షన్ సీన్లలల్లో ఎనర్జిటిక్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.తమన్నా తన పాత్ర పరిధి మేర నటించి మెప్పించింది.మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ పాత్ర చిన్నదే అయినా మెప్పించింది.నెగిటివ్ రోల్ లో పూరి అకాంక్ష గ్లామర్ పండించింది.కబీర్ సింగ్,షియాజీ షిండే తదితరులు తమ పాత్రల్లో రాణించారు.

టెక్నికల్ వర్క్:

డూడ్లీ సినిమాటోగ్రఫీ టెర్రిఫిక్ గా ఉంది.హిపాప్ తమిళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది.యాక్షన్ కొరియోగ్రఫీ,ప్రొడక్షన్ డిజైన్ అంతా గ్రాండ్ గా ఉంది.ఎడిటింగ్ బాగుంది.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు.గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకోవాల్సింది.

విశ్లేషణ:
‘‘యాక్షన్’’ మూవీ యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.చేజింగ్ సీన్లు హై లెవల్లో ఉన్నాయి.స్లోగా మొదలైన సినిమా తన అన్న ను చంపిన వాళ్లెవరో కనుక్కునే ప్రాసెస్ తో ఊపందుకుటుంది.. లేడి విలన్ కైరా ఎపిసోడ్ అంతా టెర్రిఫిక్ గా సాగుతుంది.ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. ఆ ఎపిసోడ్ డీల్ చేసిన యాక్షన్ మాస్టర్ కు,డైరెక్టర్ కు క్రెడిట్ ఇవ్వొచ్చు. ఇక ఫస్టాఫ్ లో చూపించినంత హై సెకండాఫ్ లో కొరవడిందనే చెప్పాలి.ఈ కథకు పాకిస్థాన్ టెర్రర్ బ్యాక్ డ్రాప్,స్పై థ్రిల్లర్ లా సాగే స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోవచ్చు.కాకపోతే ఫస్టాఫ్ లో కనెక్ట్ అయ్యారు కాబట్టి సెకండాఫ్ ను ఇంట్రస్టింగ్ గా చూస్తారు ప్రేక్షకులు.ఓవరాల్ గా మాస్ ప్రేక్షకులు ఈ సినిమా ఇష్టపడతారు

Latest Updates