మోడీ బయోపిక్ రిలీజ్ ఆపండి

  • ఈసీని కోరిని మాజీ ఐఏఎస్,ఐపీఎస్ లు
  • ఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా వేయాలన్న లెఫ్ట్ పార్టీలు

లోక్ సభ ఎన్ని కల దృష్ట్యా “పీఎం నరేంద్రమోడీ” బయోపిక్ విడుదలను ఆపాలని రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికా రుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది . 47 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఈ మేరకు ఈసీకి మంగళవారం లేఖ రాశారు. ఆ సినిమా విడుదలైతే ఎన్నికల్లో మోడీకి మైలేజ్ వస్తుందని, ఆయన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. లోక్ సభ ఎన్ని కలు ముగిసేవరకు మోడీ బయోపిక్ రిలీజ్ ను ఆపాలని విజ్ఞప్తి చేశారు. మోడీ బయోపిక్ విడుదలకు ప్రస్తుతం తొందరేమీ లేదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా సినిమా విడుదలను ఆపవచ్చని, ఈసీకి ఆ అధికా రం ఉందని గుర్తు చేశారు. మొదట ఏప్రిల్ 12న సినిమా విడుదల చేస్తామని ప్రకటించారని, తర్వాత ఏప్రిల్ 5 న విడుదలకు ఏర్పా చేశారని లేఖలో పేర్కొన్నారు. తొలి విడత లోక్ సభ ఎన్నికలకు వారం రోజుల ముందే ఆ సినిమా విడుదల చేస్తున్నారని ఆరోపించా రు. సినిమా థియేటర్లు, యూట్యూబ్, నెట్ ఫ్లిక్ స్, హాట్ స్టార్, ఫేస్ బుక్ ఇతర ఏ వేదికల్లో నూ ఆ సినిమా విడుదల కాకుండా ఆపాలని వారు కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలను వాయిదా వేయాలని లెఫ్ట్ పార్టీలు ఈసీని కోరాయి. ప్రధాని మోడీ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా విడుదలను ఎన్ని కలు పూర్తయ్యేవరకు వాయిదా వేయాలని సీపీఐ నేత డి.రాజా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు విజ్ఞప్తి చేశారు. మోడీ బయోపిక్ విడుదలను వాయిదా వేయాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ కూడా ఈసీని కోరింది .

 

Latest Updates