పాకిస్తాన్ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది

యూఎన్ హెచ్ఆర్సీ మీటింగ్లో యాక్టివిస్టు సజ్జద్ రజా ఆవేదన

జెనీవా(స్విట్జర్లాండ్): పాకిస్తాన్ ఆక్యూపైడ్ కశ్మీర్(పీఓకే)లోని ప్రజలను ఆ దేశం జంతువులుగా చూస్తోందని పీఓకేకు చెందిన యాక్టివిస్టు సజ్జద్ రజా ఆవేదన వ్యక్తంచేశారు. జెనీవాలో జరిగిన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(యూఎన్ హెచ్ఆర్సీ) 45వ సెషన్లో ఆయన మాట్లాడారు. పీఓకేలోని పరిస్థితులను వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. ‘‘పాక్ తీసుకొచ్చిన పీఓకే ఎలక్షన్ యాక్టుతో మాకు ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. పొలిటికల్, సివిల్, కానిస్టిట్యూషనల్ రైట్స్ అమలు కావడం లేదు. మేం గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే దేశద్రోహులని కేసులు పెడుతున్నారు. ఈ యాక్టుతో పాకిస్తాన్ ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది. వాళ్లు ప్రజలను టార్గెట్ చేసి చంపుతున్నారు. మను షులను ఎత్తుకెళ్తున్నారు” అని నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జేకేజీబీఎల్ చైర్మన్ సజ్జద్ రజా ఆవేదన వ్యక్తంచేశారు. యునైటెడ్ నేషన్స్ కలగజేసుకొని తమకు సాయం చేయాలని కోరారు.

యూత్ ను పావులుగా వాడుకుంటోంది..
జమ్మూకాశ్మీర్ బార్డర్కు ఇరువైపులా ఉన్న యూత్కు పాక్ ఆఫీసర్లు ‘బ్రెయిన్ వాష్’ చేస్తున్నారని సజ్జద్ అన్నారు. ఇండియాతో పరోక్ష యుద్ధంలో వారిని పావులుగా వాడుకుంటోందని చెప్పారు. పీఓకే నుం చి పాక్ టెర్రర్ క్యాంపులు నడుపుతోందని చెప్పారు.

For More News..

కుక్క మొరిగిందా.. కరోనా ఉన్నట్టే.. అదేలాగంటే..

చెరువుల్ని మింగి సిటీని ముంచుతున్నరు

ఈ నెల 28న రాష్ట్ర బంద్

Latest Updates