సినిమా షూటింగ్ లో గాయపడ్డ నటుడు అజిత్

తమిళ హీరో అజిత్‌కు ప్రమాదం జరిగింది. వలిమై సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడ్డాడు. బైక్‌తో రిస్కీ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. అజిత్‌ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన అజిత్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అజిత్ కొన్ని రోజులు షూటింగ్‌‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

వలిమై సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం బైక్ చేజింగ్‌కు సంబంధించి తీసిన సీన్స్‌ లో అజిత్ స్వయంగా డూప్ లేకుండా బైక్ చేజ్ స్టంట్స్ చేశారు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. బోనీ కపూర్ నిర్మింస్తు ఈ సినిమాకి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Latest Updates