లారీ డ్రైవర్‌‌‌‌గా అల్లు అర్జున్?

‘అల వైకుం ఠపురములో’ సినిమాలో అన్నింటికంటే పెద్ద ప్లస్ అల్లు అర్జున్ పర్‌‌‌‌పార్మెన్స్ అంటున్నారంతా. అతని లుక్‌‌ కూడా అందరికీ తెగనచ్చేసింది. సాధారణంగా ప్రతి సినిమాకీ కొత్తలుక్‌‌తోనే కనిపిస్తాడు బన్నీ. తర్వాతి సినిమాకి కూడా అదే చేస్తున్నాడట. అయితే ఇది గత సినిమాను మించి ఉంటుందని అంటున్నారు. బన్నీ తర్వాతి సినిమా సుకుమార్ డైరెక్షన్‌లో అనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బన్నీ వైవిధ్య భరితమైన పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. చిత్తూరులోని శేషాచలం అడవుల్లో గంధపుచెట్లను కొల్లగొట్టే స్మగ్లర్లతో కలిసి పనిచేస్తాడని, లారీ డ్రైవర్‌‌‌‌ అవతారం ఎత్తనున్నాడని ప్రచారం జరుగుతోంది. దాంతో చిత్తూరు కుర్రాడిగా కనిపించేందుకు తన భాష, యాస మారుస్తున్నాడట. మేకోవర్‌‌‌‌ కోసం ప్రత్యేకించి ట్రైనర్‌‌‌‌ని కూడా నియమించుకున్నాడట. తనపాత్ర పై అల్లు అర్జున్ ఎంత శ్రద్ధ చూపుతాడో, ఎంత కమిట్‌‌మెంట్‌‌తో పని చేస్తాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలోనూ అదేజరగడంలో ఆశ్చర్యం లేదు. పైగా అక్కడున్నది సుకుమార్‌‌‌‌ కనుక నేచురాలిటీ కోసం ఇంకాస్త ఎక్కువ కసరత్తు ఉంటుంది. చూద్దాం.. ఈసారి బన్నీ మేకోవర్ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో.

For More News..

అలాంటి పాత్రలు చేయడానికి నేను సిద్ధం

తమ ఓటు తామే వేసుకోని వార్డు మెంబర్లు

Latest Updates