మంట‌గ‌లిసిన మాన‌వత్వం : షూటింగ్ స్పాట్ లో కుప్ప‌కూలి నటుడు దుర్మ‌ర‌ణం

మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ షూటింగ్ స్పాట్ లో మ‌ర‌ణించారు. కేరళలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈ బృందం షూటింగ్ చేస్తుంది.

కొచ్చిలోని కుందన్నూర్ బండ్ రోడ్ వ్యర్థాలను డంప్ చేయ‌డాన్ని విదేశీయుడి పాత్ర‌లో ఉన్న ప్ర‌బీష్ స్పందించాలి. త‌న పాత్ర‌లో భాగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్ర‌బీష్ త‌న స‌హ‌చ‌రుల‌తో ఫోటోలు దిగుతుండ‌గా సెట్లోనే కుప్ప‌కూలిపోయాడు.

తన నాలుక పొడిగా ఉందని, తాగ‌డానికి నీళ్లు కావాల‌ని ప్ర‌బీష్ సినిమా వీడియోగ్రాఫర్ సుజిత్‌ని కోరాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అత‌ను వెంట‌నే నీళ్లు తాగించ‌డంతో మ‌ళ్లీ కుప్ప‌కూలిపోయిన‌ట్లు తెలుస్తోంది.

అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న కార్ల‌ను ఆపే ప్ర‌య‌త్నం చేసినా ఎవ‌రూ ఆపలేద‌ని కొద్ది సేప‌టికి ప్ర‌బీష్ కార్లోనే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు సిబ్బంది తెలిపారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించే మార్గం మ‌ధ్య‌లోనే అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు మాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు న‌టులు తెలిపారు.

Latest Updates