బీజేపీలో చేరిన సినీనటి జయప్రద

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరారు. గతంలో యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున రెండుసార్లు గెలిచారు జయప్రద. సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కు జయప్రద అత్యంత సన్నిహితురాలు. జయప్రదను గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే అమర్ సింగ్ ను కూడా సస్పెండ్ చేశారు. మోడీ నాయకత్వం, అభివృద్ధి చూసి బీజేపీలో చేరానని జయప్రద చెప్పారు. మోడీ నాయకత్వంలో పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. జయప్రదను రాంపూర్ నుంచి బరిలో దించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే నిజమైతే… జయప్రద సమాజ్ వాదీ సీనియర్ నేత ఆజంఖాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Latest Updates