ఓ అమ్మాయిని రోడ్డుపై వేధించిన సినీ నటుడు…

కన్నడ సినీ నటుడు, ప్రొడ్యూసర్ హుచ్చ వెంకట్ ఓ అమ్మాయిని వేధించాడు.  హిందూపురం – యలహంక మార్గంలోని మారసంద్ర టోల్ గేట్ వద్ద ఓ అమ్మాయిని ప్రేమించమంటూ.. పెళ్లిచేసుకోవాలంటూ వేధించాడు. అయితే ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్న ఆ అమ్మయి తీవ్రభయానికి లోనైంది. ముక్కూ ముఖం తెలియని వ్యక్తి తనను రోడ్డుపై చూసి పెళ్లిచేసుకోవాలనడంతో షాక్ అమ్మానని తెలిపింది. అయితే వెంకట్ మాత్రం తన ప్రేమను ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో తీవ్ర కోపానికి గురైన అతను అతని కారు అద్దాలను చేతితో గుద్దాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. హుచ్చా వెంకట్ పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసునమోదు చేసుకున్నారు. దొడ్డబల్లాపూర్ మీదుగా టోల్ గేట్ వద్దకు వెళ్లిప వెంకట్ రోడ్డుపై వెళ్తున్న ఆ అమ్మాయిని చూసి కారు దిగాడని.. వెళ్లి ప్రేమించాలని పెండ్లి చేసుకోవాలని వేధించినట్టు తెలిపారు.

Latest Updates