యాక్టర్ ఖుష్బూ కారును ఢీకొన్న ట్యాంకర్.. కారులోనే ఖుష్బూ

యాక్టర్, బీజేపీ లీడర్ ఖష్బూ కారుకు కాంచీపురం జిల్లాలో ప్రమాదం జరిగింది. ఖుష్బూ ఈ రోజు కడలూరులోని వెల్‌యాత్రి సదస్సులో పాల్గొనడానికి వెళ్తుండగా మెల్మార్‌వతుర్ సమీపంలో ఆమె కారును పక్కగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖుష్బూకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం డామేజ్ అయింది.

‘ఒక ట్యాంకర్ మా కారు పైకి దూసుకొచ్చింది. ఈ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టింది. అభిమానుల ఆశీస్సులు, దేవుని దయ వల్ల మాకు ఏం జరగలేదు. నేను సురక్షితంగా ఉన్నాను. కడలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లార్డ్ మురుగన్ మమ్మల్ని రక్షించాడు. నా భర్తకు ఆ దేవుని మీద చాలా నమ్మకం ఉంది. పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేక కావాలనే చేశారా అనే కోణంలో పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు.

For More News..

తెలంగాణలో మరో 948 కరోనా కేసులు

కూలీలుగా మారిన ఫీల్డ్​ అసిస్టెంట్లు

క్లోజ్ ఫ్రెండ్‌తో గొడవలా.. అయితే ఇలా చేయండి

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

Latest Updates