ఇప్పుడు చెబుతున్నా BJPలో చేరండి : కృష్ణంరాజు

విజయవాడ : దేశంలో అభివృద్ధి ఒక్క BJPతోనే సాధ్యం అన్నారు మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు. ఆదివారం విజయవాడలో మాట్లాడిన ఆయన..తన ఫ్యాన్స్ ను BJPలో చేరాలని ఫిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..నా అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు… నేను ఎప్పుడు BJPలో చేరండి అని ఎప్పుడు చెప్పలేదు. ప్రస్తుతం BJP మాత్రమే దేశ కాంక్షను కోరుకుంటుంది. 11వ స్థానంలో ఉన్న మన దేశం మోడి పాలన వల్ల 5 స్థానానికి చేరుకుంది.

త్వరలో 3 స్థానంలోకి భారతదేశం రావడం ఖాయం. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకునే‌ అభిమానులకు ఇప్పుడు చెబుతున్నా BJPలో‌ చేరండి. వారసత్వం కాకుండా, ప్రతిభ, ప్రజా క్షేమం కోరే వారే BJPలో నాయకులుగా ఎదుగుతారు. కిషన్ రెడ్డి ఎదిగిన వైనమే ఇందుకు నిదర్శనం అని తెలిపారు కృష్ణంరాజు.

Latest Updates