నటుడు ‘లవకుశ’ నాగరాజు ఇక లేరు 

హైదరాబాద్: మహా నటుడు ఎన్టీఆర్, అంజలి దేవి జంటగా నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవ కుశులుగా సుబ్రహ్మణ్యం, నాగరాజులు నటించారు. బాల లవకుశుల జంట చాలా కాలం అనేక సినిమాల్లో అలరించారు. వీరిలో కుశుడుగా నటించిన అనపర్తి నాగరాజు ఇవాళ ఉదయం  కన్నుమూశారు.  71 సంవత్సరాల వయసుగల  నాగరాజు  గుండెపోటుతో హైదరాబాద్‌ లోని గాంధీ నగర్ లో  తన స్వగృహం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు. నాగరాజు లవకుశ చిత్రం ద్వారా బాల నటుడిగా  వెండితెరకు పరిచమయ్యారు.  ఇప్పటివరకు తెలుగు తమిళం భాషల్లో  340కు పైగా చిత్రాల్లో నటించారు.  ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో షుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో  నటించారు.

Latest Updates