అభిమానులకు మహేష్ బాబు ట్వీట్

ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులకు ఓ ట్వీట్ చేశారు. హీరో మహేష్ ఆగష్టు 9న 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే తన బర్త్ డే సందర్భంగా అభిమానులెవరూ వేడుకలు జరుపొద్దని ఆయన కోరారు. దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోన్నందున అందరూ కరోనా నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అందుకే ఈ సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వేడుకలు నిర్వహించొద్దని అభిమానులను ఆయన కోరారు.

For More News..

దేశంలో నిన్న రికార్డుస్థాయిలో కరోనా కేసులు

ఒక్క బ్లాస్ట్ ఖరీదు రూ. లక్ష కోట్ల నష్టం

చైనాకు చెందిన 2,500 యూట్యూబ్ చానెల్స్‌‌‌‌పై వేటు

Latest Updates