మోహన్‌బాబుకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌.. కేసు నమోదు

Actor Mohanbabu files police complaint on threat calls from unknown numbers

తాను వైసీపీలో చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సినీ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి మోహన్ బాబుకు వచ్చినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.

Latest Updates