ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ‌కు మాతృ వియోగం

‌‌ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి పద్మగారు గత రాత్రి ముంబైలోని త‌మ స్వగృహంలో కన్నుమూసారు. ఆమె వయసు 76 ఏళ్లు. గుండె పోటు తో ఆమె కన్నుమూసినట్టు సమాచారం. ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు త‌మ సంతాపం తెలుపుతున్నారు.

ముంబైలో స్థిర‌ప‌డిన తెలుగు కుటుంబం ముర‌ళీ శ‌ర్మది. ఆయ‌న తండ్రి వృజ్ భూషణ్ మరాఠీ కాగా త‌ల్లి పద్మగారిది గుంటూరు. తండ్రి వ్యాపారరీత్యా వారు ముంబయిలో స్థిరపడ్డారు. ఈ ఏడాది విడుదలైన ‘అల వైకుంఠ‌పురములో’ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మురళీ శర్మ.

actor murali sharma mother passed away with heart attack

Latest Updates