నాగబాబు మరో ట్వీట్ : ఇండియన్ కరెన్సీ మీద వాళ్ళ బొమ్మలు చూడాలని ఉంది

మహాత్మగాంధీపై మరోసారి ట్వీట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఇండియన్  కరెన్సీ  మీద… సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ , అబ్దుల్ కలాం, సావర్కార్ , వాజ్ పేయి లాంటి మహానుభావుల చిత్రాలు చూడాలని ఉందన్నారు. స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన  నేతలను… జనం మర్చిపోకూడదని నాగబాబు ట్వీట్ చేశారు. గాంధీ బతికి ఉంటే తనతో పాటు…. దేశానికి సేవ చేసిన మహానుభావులను గౌరవించమని తప్పకుండా చెప్పేవారని నాగబాబు ట్వీట్ లో రాశారు. ఇటీవలే మహాత్మగాంధీని చంపిన  గాడ్సేపై… నాగబాబు చేసిన ట్వీట్ వివాదమైంది. నాగబాబును  సమర్ధిస్తూ   కొందరు, వ్యతిరేకిస్తూ  మరికొందరు… సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates